: భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలకు రావాలని బాన్ కీ మూన్ పిలుపు


పలుమార్లు భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలు రద్దయిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్పందించారు. ఇరు దేశాలు ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందిగా పిలుపునిచ్చినట్టు ఆయన అధికారిక ప్రతినిధి స్పెపానే దుజార్కిక్ వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను చర్చలతో నిలువరించుకోవాలని సూచించారన్నారు. ఈ మేరకు "మేం ప్రపంచంలోని అన్ని దేశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మార్పులను గమనిస్తున్నాం, పరిస్థితులు చేయిదాటే పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అణ్వాయుధ సామర్థ్యం ఉన్న భారత్, పాక్ లు నేరుగా చర్చలకు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను" అని బాన్ చెప్పినట్టు తెలిపారు. అంతేగాక ఇరు దేశాల సరిహద్దుల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న అంశాలు తమ దృష్టికి వస్తున్నాయని, దానిపై కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News