: జగతి పెట్టుబడుల కేసును బదిలీ చేయండి... సీబీఐ కోర్టులో ఈడీ పిటిషన్


జగన్ అక్రమాస్తుల కేసుల్లోని జగతి పెట్టుబడుల కేసును ఆర్థిక నేరాల కోర్టుకు బదిలీ చేయాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిటిషన్ వేసింది. రూ.34.65 కోట్ల పెట్టుబడులపై మనీలాండరింగ్ చట్టం ప్రకారం విచారణ కోసమే ఈ మేరకు కోరుతున్నామని తెలిపింది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తి చేసిన ఈ కేసును తమ శాఖ కోర్టుకు బదిలీ చేయాలని గతంలో ఈడీ అధికారులు కోరినప్పటికీ సీబీఐ కోర్టు తిరస్కరించింది. దాంతో ఈసారి పీఎంఎల్ చట్టంలోని సెక్షన్ 44(1)(సి)ని పేర్కొంటూ పిటిషన్ వేసింది. దానిపై ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News