: షీనా బోరా బతికే ఉందట... ఇంద్రాణి కొత్తకథ... తల పట్టుకున్న ముంబై పోలీసులు!


ఇంద్రాణి ముఖర్జియా కేసులో అనుకోని మలుపు... తాను తన బిడ్డ షీనా బోరాను చంపలేదని, ఆమె అమెరికాలో బతికేవుందని, తనంటే ద్వేషంతోనే షీనా బయటకు రావడం లేదని పోలీసుల విచారణలో ఇంద్రాణి వెల్లడించినట్టు తెలుస్తోంది. షీనా బోరా హత్యకు గురైన దాదాపు మూడేళ్లకు షీనాను, అమె రెండవ భర్త సంజీవ్ ఖన్నాను, కారు డ్రైవర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇంద్రాణి విచారణలో చెబుతున్న విషయాలతో, పోలీసులే తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో ఎలా ముందుకు సాగాలా? అని ఆలోచిస్తున్నట్టు ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి. షీనా బతికే ఉందని ఇంద్రాణి చేస్తున్న వాదనను నమ్మడం లేదని, ఆమె యూఎస్ ప్రయాణించిందని చెబుతున్న సమయంలో విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. షీనా సెల్ ఫోన్ ను ఇంద్రాణి సంవత్సరం రోజుల పాటు వాడుకుందనటానికి, ఆ సెల్ నుంచి రాహుల్ ముఖర్జియాకు మెసేజ్ లు వెళ్లాయని తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్టు పోలీసులు అంటున్నారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఓ కొలిక్కి తీసుకువస్తామని వివరించారు. కాగా, కొడుకును విషం పెట్టి చంపాలని చూసినందున, ఇంద్రాణిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు పెడుతున్నట్టు తెలియజేశారు.

  • Loading...

More Telugu News