: మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం... గాంధీ ఆసుపత్రిలో చేరిన ఐదుగురు రోగులు
గతేడాది తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన స్వైన్ ఫ్లూ మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. తాజాగా ఈ వ్యాధి లక్షణాలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తూనే వారి నమూనాలను సేకరించిన వైద్యులు పరీక్షల నిమిత్తం వాటిని ల్యాబ్ లకు పంపించారు. స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి రోగులు రావడంతో అక్కడి ఇతర రోగులతో పాటు వైద్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.