: తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ ఒకటే... అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు


ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షం వైసీపీ ప్లకార్డులు చేతబట్టింది. దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేతబట్టి సభలోకి రావడం పధ్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అయినా వినని విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. దీంతో సభాసమయం వృథా అవుతోందంటూ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ వైఖరిని తప్పుబట్టారు. పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ రెండూ ఒకటేనని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News