: ఇక ఆన్ లైన్లో ... విమానం అద్దెకు!
విమానాలను, హెలికాప్టర్లను అద్దెకు తీసుకునే వారి కోసం ఆన్ లైన్లో అవకాశం కల్పిస్తున్నట్టు 'డ్రూమ్' ప్రకటించింది. అద్దెకు బుక్ చేసుకోవడంతో పాటు, సొంతానికి కొనుగోలు చేయాలనుకునే వారు ఆర్డర్లు పెట్టే సదుపాయాన్ని దగ్గర చేసినట్టు డ్రూమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సందీప్ అగర్వాల్ వివరించారు. చిన్న సైకిళ్ల నుంచి విమానాల వరకూ 14 రకాల సేవలను వెబ్ సైట్ ద్వారా అందిస్తున్నామని ఆయన అన్నారు. పౌర విమానయాన రంగంలోని 'జెట్ సెట్ గో'తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అద్దె విమానాలు, హెలికాప్టర్ల సేవలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. అత్యవసర ప్రయాణాలు పెట్టుకున్న హై నెట్ వర్త్ వ్యక్తులకు, భారీ మొత్తాలు వినియోగించి వివాహాది వేడుకలు చేసుకునే వారికి తమ సర్వీస్ లు ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుతం సంస్థ సేవలను 10 వేల మంది వినియోగించుకుంటున్నారని, వచ్చే రెండేళ్ల వ్యవధిలో 50 వేల మందికి దగ్గర కావాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.