: హోదాపై వెనక్కి తగ్గలేదు... కసరత్తు చేస్తున్నాం: నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై వెనక్కి తగ్గలేదని కేంద్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. హైరాబాదులో ఆమె మాట్లాడుతూ, ప్రత్యేకహోదాపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనకపోవడమే ఆలస్యానికి కారణమని ఆమె వెల్లడించారు. సాంకేతిక అంశాలను పరిష్కరించి ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ కు వర్తింపజేస్తామని ఆమె తెలిపారు. ప్రత్యేకహోదాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె భరోసా ఇచ్చారు.