: ఉరి శిక్షను రద్దు చేయాలని కోరిన లా కమిషన్
ఉరిశిక్షను రద్దు చేయాలని లా కమిషన్ సిఫారసు చేసింది. అయితే, యుద్ధ నేరాలు, ఉగ్రవాదం కేసుల్లోని దోషులకు మాత్రం ఉరిశిక్ష విధించవచ్చని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదికపై లా కమిషన్ లోని ముగ్గురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా... మరో ఆరుగురు మాత్రం మద్దతు తెలిపారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారికి మరణశిక్షపై పార్లమెంటులో చర్చ జరగాలని... ఈ కేసులకు సంబంధించి ఉరిశిక్ష రద్దుకు సిఫారసు చేయబోమని లా కమిషన్ స్పష్టం చేసింది.