: ఇంద్రాణి ముఖర్జియాకు విషం పెట్టొచ్చు: కోర్టుకు తెలిపిన ప్రాసిక్యూషన్
కన్నకూతురు షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియాను ఈ రోజు ముంబైలోని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇంద్రాణిని విచారించడానికి మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇది ఇలా ఉండగా, ఇంద్రాణిపై విష ప్రయోగం జరిగే అవకాశాలు ఉన్నాయని... అందువల్ల ఆమె ఇంటి నుంచి ఆహారాన్ని అనుమతించరాదని ప్రాసిక్యూషన్ వాదించింది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... కోర్టులో ఇంద్రాణిని విచారిస్తున్న సమయంలో ఊహించని విధంగా ఆమె కళ్లుతిరిగి కిందపడిపోయింది. కొంతసేపటి తర్వాత ఆమె మళ్లీ కోలుకుంది. అనంతరం విచారణ చేపట్టిన కోర్టు... ఆమె పోలీస్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.