: ఇంద్రాణి ముఖర్జియాపై మరో కేసు నమోదు


ఇంద్రాణి ముఖర్జియాపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కుమార్తె షీనా బోరా హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంద్రాణి కుమారుడు మిఖాయిల్ బోరాను కూడా హత్య చేసేందుకు కుట్రపన్నిందని పోలీసులు ధ్రువీకరించారు. దీంతో ఆమె, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లపై మరో కేసు నమోదు చేశారు. షీనా బోరా హత్యోదంతం వెలుగు చూడడంతో ఈ సంఘటన ధ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్టులతో సాగుతోంది. కుమార్తెను చంపి సూట్ కేసులో పెట్టి దహనం చేసినట్టే, కుమారుడు మిఖాయిల్ ను కూడా హత్య చేసి సూట్ కేసులో పెట్టి దహనం చేయాలని ఇంద్రాణి ముఖర్జియా కుట్రపన్నినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నివాసం నుంచి భారీ సూట్ కేసునొకదానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆమెపై హత్యయత్నం కేసు నమోదు చేయనున్నారు.

  • Loading...

More Telugu News