: మ్యూజిక్ మేస్ట్రోకు ఆతిథ్యమిచ్చి మురిసిన మాస్టర్


మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆతిథ్యమిచ్చాడు. ముంబైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా రహమాన్, సచిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేస్ట్రోను మాస్టర్ మద్యాహ్న భోజనానికి ఆహ్వానించాడు. సచిన్ పై అభిమానంతో రెహమాన్ విందుకు విచ్చేశాడు. దీంతో హర్షం వ్యక్తం చేసిన సచిన్ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపాడు. 'వారాంతం మ్యూజిక్ మేస్ట్రోను కలిశాను. రెహమాన్ కి ఆతిథ్యమివ్వడం ఆనందానికి గురిచేసింది. కబుర్లు, భోజనంతో ఆహ్లాదకరంగా గడిపాం' అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. రెహమాన్ తో ముచ్చట్ల ఫోటోను కూడా పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News