: సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సంతకంతో మోసం... డబ్బు వసూలు
సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ సంతకంతో ఆన్ లైన్ మోసం వెలుగుచూసింది. హైదరాబాద్ లో ఆయన సహకారంతో ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నామంటూ పలువురి నుంచి నైజీరియన్ల ముఠా రూ.10 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నైజీరియన్లు, ముగ్గురు మహారాష్ట్ర వాసులను ముంబైలో అరెస్టు చేశారు. వెంటనే వారిని హైదరాబాద్ తరలించి కేసు నమోదు చేశారు. వారి నుంచి 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.