: 'అందమైన యువతులకు విజయం సులువు'... ఫ్లిప్ కార్ట్ వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసన


మహిళా కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ పంపిన ఈ-మెయిల్ పై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. "యువతులు అందంగా ఉంటే మరిన్ని విజయావకాశాలు లభిస్తాయని ఓ రీసెర్చ్ చెబుతోంది. యువతులు అందంగా కనిపిస్తే, వారివైపు చూస్తారు. వారు చెప్పేది వింటారు. అలా కనిపించే వారిలో నమ్మకం పెరుగుతుంది. ఇతరులను సైతం మోటివేట్ చేస్తారు" అంటూ, మహిళలను అందంగా చూపే దుస్తులపై 20 శాతం అదనపు రాయితీలు ఇస్తామని మెయిల్ పెట్టింది. ఈ వ్యాఖ్యలు సమంజసం కాదని రిచా కౌల్ అనే ఫ్లిప్ కార్ట్ కస్టమర్ వ్యాఖ్యానించారు. దీనిపై వెల్లువెత్తుతున్న నిరసనలను కట్టడి చేసేందుకు ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు పునీత్ సోనీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్షమాపణలు చెప్పారు. ఈ మెయిల్ తన దృష్టికి రాలేదని, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని మరో మెయిల్ పంపుతామని ఆయన తెలిపారు. ఈ తరహా ఘటనలు మరోసారి జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.

  • Loading...

More Telugu News