: టోపీ ధరించి హైకోర్టుకు వచ్చిన మహబూబ్ నగర్ ఎస్పీ... మందలించిన న్యాయమూర్తి
ఇసుక మాఫియా కేసు విచారణ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు విచారణకు ఎస్పీ టోపీ ధరించి కోర్టుకు వచ్చారు. ఇది గమనించిన న్యాయమూర్తి... న్యాయస్థానంలో టోపీ ధరించకూడదని మీకు తెలియదా? అని ప్రశ్నించారు. న్యాయస్థానంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని మందలించారు. అనంతరం ఇసుక మాఫియాపై ఇంతవరకు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. మొత్తం 12 మందిపై కేసులు పెట్టామని వారిలో నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. అసలు మాఫియా వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం వివరాలు తేల్చాలని జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.