: విచారణలో భాగంగా ఇంద్రాణిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం!


కస్టడీలో ఉన్న ఇంద్రాణి నుంచి నిజం చెప్పించేందుకు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారట. ఆమె చెంపలు వాయించారని, లాఠీలతో కొట్టారని ఇంద్రాణి తరపు న్యాయవాది ఆరోపించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన క్లయింటు పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ మేరకు ముంబై పోలీసు కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నేరాన్ని అంగీకరించాలని ఇంద్రాణిని బలవంతం చేస్తున్నారని తెలిపారు. కాగా, ఇంద్రాణి కస్టడీ నేటితో ముగియడంతో, ఆమెతో పాటు సంజీవ్ ఖన్నా కుమార్తె విధిలను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి వున్నందున, ఇంకొన్ని రోజుల పాటు ఆమెను ప్రశ్నించేందుకు అనుమతించాలని ముంబై పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సాయంత్రంలోగా ఓ నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News