: వికెట్లు పడుతున్నా... భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా భారత్


శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా భారత బ్యాటింగ్ కొనసాగుతోంది. నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 132 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్ లీడ్ ను కలుపుకుంటే ఇప్పటి వరకు 243 పరుగుల ఆధిక్యతను సాధించింది. మరో ఐదు వికెట్లు చేతిలో ఉన్న నేపథ్యంలో, శ్రీలంకు టఫ్ టార్గెట్ నిర్దేశించడం ఖాయంగా కనిపిస్తోంది. పుజారా (0), రాహుల్ (2), రహానే (4), కోహ్లీ (21) విఫలమైనప్పటికీ... రోహిత్ శర్మ 50 పరుగులు చేసి స్కోరు బోర్డును గాడిలో పెట్టాడు. ప్రస్తుతం బిన్నీ (38), నమన్ ఓజా (11) సమయోచితంగా ఆడుతూ స్కోరును పెంచే పనిలో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్ 2, ప్రదీప్ 3 వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News