: ఈ సారి రోహిత్ వంతు... హాఫ్ సెంచరీ చేసిన స్టైలిష్ బ్యాట్స్ మన్
శ్రీలంక టూర్ లో టీమిండియా బ్యాట్స్ మన్ వంతుల వారీగా అదరగొడుతున్నారు. మొన్న అజింక్యా రెహానే, నిన్న చటేశ్వర్ పుజారా... తాజాగా రోహిత్ శర్మ లంక బౌలర్లను ఆడుకున్నారు. చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ సహచరులంతా పెవిలియన్ కు క్యూ కడుతున్నా, ఏమాత్రం అధైర్యపడని పుజారా లంక బౌలర్లపై వీర విహారం చేశాడు. ఓపెనర్ గా వెళ్లిన అతడు ఇన్నింగ్స్ ముగిసేదాకా క్రీజులోనే ఉండి నాటౌట్ గా నిలిచాడు. తాజాగా రెండో ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులో అడుగుపెట్టిన టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. నింపాదిగా బ్యాటింగ్ చేేస్తూనే 72 బంతుల్లోొ హాఫ్ సెంచరీ చేశాడు. నాలుగు ఫోర్లు కొట్టిన రోహిత్ ఓ సిక్స్ నూ బాదాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మరుక్షణమే అతడు ఔటయ్యాడు. ఇక రోహిత్ ఊపుతో స్టువర్ట్ బిన్నీ(37) కూడా బ్యాట్ ఝుళిపించాడు. కడపటి వార్తలందేసరికి టీమిండియా 35 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.