: నేను మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారు: జగన్ ఆవేదన
అసెంబ్లీలో సభ జరుగుతున్న తీరు పట్ల వైకాపా అధినేత జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతుంటే పదేపదే మైక్ కట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి శాసనసభ లైవ్ కవరేజ్ హక్కులు ఇవ్వడమే తమ దురదృష్టమని అన్నారు. చంద్రబాబుకు తప్ప తమకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. పుష్కర తొక్కిసలాటపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేయగానే ఆయన మైక్ కట్ అయింది. దీంతో, వైకాపా సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, స్పీకర్ కోడెల కల్పించుకుని సభకు ఆటంకం కల్పించవద్దని... సభానాయకుడిగా చంద్రబాబు మాట్లాడిన తర్వాత జగన్ కు మైక్ ఇస్తామని చెప్పారు. అయినా వైకాపా సభ్యులు శాంతించకుండా పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.