: సొంత కరెన్సీ తయారు చేసుకున్న ఐఎస్ఐఎస్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) సొంత కరెన్సీ తయారుచేసుకుంది. బంగారు, వెండి, ఇత్తడి రూపంలో దినార్ నాణేలను ఐఎస్ ముద్రిస్తోంది. ఒక్కో బంగారు దినార్ విలువ 139 డాలర్లు అని ఓ వీడియో ప్రకటనలో తెలిపింది. అగ్రరాజ్యాల పెట్టుబడులతో ప్రపంచ దేశాలను బానిసలుగా మార్చే వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ నాణేలు తీసుకొస్తున్నట్టు ఐఎస్ వెల్లడించింది.