: ‘హోదా’పై రాజీ లేని పోరే... అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన జగన్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరు సాగించనున్నట్లు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రకటించింది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేని ఏపీ నేతలు కేంద్ర కేవినెట్ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా తదితరులు మీడియాతో మాట్లాడారు. తొలి రోజు సమావేశాల్లో ప్రధానంగా ప్రత్యేక హోదాపైనే చర్చకు పట్టుబట్టనున్నట్లు వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే, కీలకమైన బీఏసీ సమావేశానికి డుమ్మా కొట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీలో పాలుపంచుకున్నారు.