: ఇకపై కిరాణా దుకాణాల్లోనూ వంట గ్యాస్ సిలిండర్లు
ఇకపై వీధుల్లోని కిరాణా దుకాణాల్లో సైతం వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. దేశవాళీ గృహ వినియోగానికి వాడుతున్న 14.2 కిలోలు, 5 కిలోల సిలిండర్ల వ్యయం పేదలకు భారంగా ఉందని భావిస్తున్న మోదీ సర్కారు, ఇకపై 2 కిలోల సిలిండర్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలు, హాస్టళ్లు, అద్దె గదుల్లో ఉండే విద్యార్థులకు ఇది ఉపయోగంగా ఉంటుందన్నది కేంద్ర అభిమతం. త్వరలోనే 2 కిలోల గ్యాస్ సిలిండర్లు మార్కెట్ ధరకు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ వివరించారు. కాగా, కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు కావాలనుకునేవారు ఇంటర్నెట్ మాధ్యమంగా ధరఖాస్తు చేసుకునే అవకాశం దగ్గరైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 25 లక్షల మంది వంట గ్యాస్ రాయితీని వదులుకున్నారని ప్రధాన్ తెలిపారు.