: ప్రారంభమైన బీఏసీ సమావేశం... హాజరైన చంద్రబాబు, డుమ్మా కొట్టిన జగన్
ఏపీ శాసనసభ సమావేశాల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం శాసనసభా వ్యవహారాల కమిటి (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశమైంది. స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో యనమల రామకృష్ణుడు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఇక విపక్షం వైసీపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్ రెడ్డి మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశాల నిర్వహణ, ఎన్నిరోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్న అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డుమ్మా కొట్టారు.