: ఏపీలో మూతపడ్డ పెట్రోల్ బంకులు... వ్యాట్ తగ్గించాలని డీలర్ల డిమాండ్


పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను రద్దు చేయాలని ఢిమాండ్ చేస్తూ ఏపీలోని పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈ ఆందోళనలో భాగంగా ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకులను డీలర్లు మూసివేశారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇంధన విక్రయాలను నిలిపేసిన డీలర్లు, తమ డిమాండ్లను నెరవేర్చేదాకా బంకులను తెరిచేది లేదంటూ తేల్చిచెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డీలర్లు ఆందోళనకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో కేంద్రం పెట్రోల్ ధరలను తగ్గిస్తే, ఏపీ సర్కారు వ్యాట్ పేరిట ధరలను పెంచిందని డీలర్లు ఆరోపిస్తున్నారు. తక్షణమే వ్యాట్ ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News