: 'స్వాభిమాన్' ర్యాలీ తుస్సుమంది: పాశ్వాన్


బీహార్ లో జేడీ (యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించిన స్వాభిమాన్ ర్యాలీ తుస్సుమందని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఎద్దేవా చేశారు. పాట్నాలో నిర్వహించిన ఈ సభకు పెద్దగా జనం రాలేదని పెదవి విరిచారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని, ఆ మూడు పార్టీలకు దిమ్మదిరిగిపోతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే బీహార్ లో ప్రధాని మోదీ నిర్వహించిన సభ భారీ స్థాయిలో విజయవంతం అయిందని, ఆ సభకు దీటుగా ఉండేందుకుని నిర్వహించిన స్వాభిమాన్ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. బీహార్ ప్రజలకు అంతా తెలుసని పేర్కొన్నారు. నితీశ్ పాలనపై ఇప్పటికే వారు ఓ అంచనాకు వచ్చారని తెలిపారు. బీహార్ ప్రజలు మరోసారి ఆయన పాలనను కోరుకోవడం లేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News