: మాజీ భార్యను చంపేందుకు ఇంటి చుట్టూ 19 నాటు బాంబులు అమర్చాడు!
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి తన మాజీ భార్యను హతమార్చేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. శ్రీధర్ రెడ్డిని ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రాణ నష్టం జరగకుండా నివారించారు. తన మాజీ భార్యను చంపేందుకు అతడు ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి, 19 నాటుబాంబులు అమర్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని, బాంబులు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.