: జగన్ పై విమర్శలు గుప్పించిన అచ్చెన్న
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా డిమాండ్ ను అడ్డంపెట్టుకుని జగన్ డ్రామాలకు తెరదీశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో తెలియకుండా జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీడీపీ నుంచి బీజేపీ విడిపోతే, అప్పడు తాము బీజేపీతో జట్టుకట్టవచ్చని వైసీపీ అధినాయకత్వం భావిస్తోందని అన్నారు. బీజేపీతో చెలిమి చేసి, కేసులు మాఫీ చేయించుకునేందుకు జగన్ తాపత్రయపడుతున్నాడని అచ్చెన్న విమర్శించారు.