: సర్కారుకు వ్యతిరేకంగా జీజీహెచ్ లో సమ్మె చేస్తామంటే సహించేది లేదు: కామినేని


కృష్ణా జిల్లా గుడివాడలో 4 జిల్లాల ప్రైవేటు వైద్యుల పునశ్చరణ తరగతులను ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుంటూరు జీజీహెచ్ లో చిన్నారి మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని విచారణలో స్పష్టమైందని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీజీహెచ్ లో సమ్మె చేస్తామంటే సహించేది లేదని అన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ఆసుపత్రిలో ఓ పసికందు ఎలుకల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో, ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ పలువురిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News