: కన్నడ రచయిత కాలబుర్గి కాల్చివేత
కర్ణాటకలో సుప్రసిద్ధ రచయిత, విద్యావేత్త మల్లేశప్ప ఎం కాలబుర్గి హత్యకు గురయ్యారు. ధార్వాడ్ లో ఆదివారం ఉదయం గుర్తు తెలియని దుండగులు ఆయనను కాల్చి చంపారు. కాలబుర్గి నివాసంలో ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు తీవ్ర వాగ్యుద్ధం అనంతరం ఆయనపై కాల్పులు జరిపారు. ఇది హిందుత్వ శక్తుల పనే అయివుంటుందని పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. హంపిలోని కన్నడ యూనివర్శిటీకి కాలబుర్గి వైస్ చాన్సలర్ గా వ్యవహరించారు. మార్గా-4 పేరిట ఆయన విడుదల చేసిన వందలాది పరిశోధక వ్యాసాల సంకలనానికి 2006లో జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.