: ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వాలు ముందుకురావాలి... కేంద్ర మంత్రి వెంకయ్య పిలుపు
‘‘దేశంలో వైద్యం ఇంకా వెనుకబడే ఉంది. ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వాలు ముందుకు రావాలి’’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల దాడిలో చిన్నారి మృతి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో కింది నుంచి పై స్థాయి వరకూ సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. వైద్యుల కొరత తీర్చేందుకు వైద్య కళాశాలల ఏర్పాటు నిబంధనలను సడలించామని ఆయన పేర్కొన్నారు. వైద్యం, విద్య ఖర్చులు పెరిగిపోవడం కూడా రైతుల ఆత్మహత్యలకు ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.