: పనిమనిషిపై మాజీ క్రికెటర్ దాడి... కేసు నమోదు చేసిన పోలీసులు


ఇంటిలో పనిచేసినందుకు వేతనం అడిగిన పనిమనిషిపై ఓ మాజీ క్రికెటర్ తన భార్యతో కలిసి దాడికి దిగాడు. బాధితురాలి ఫిర్యాదుతో ముంబై పోలీసులు మాజీ క్రికెటర్ దంపతులపై కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో చిక్కుకున్నది మరెవరో కాదు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బాల్య మిత్రుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, ఆయన భార్య ఆండ్రియాలే. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వినోద్ కాంబ్లీ తాజాగా ఈ వివాదాన్ని కొని తెచ్చుకున్నట్లైంది. తన ఇంటిలో పనిచేసిన పనిమనిషి వేతనం అడిగిన కారణంగా కాంబ్లీ దంపతులు ఆమెపై దాడికి దిగారట. మూడు రోజుల పాటు చీకటి గదిలో నిర్బంధించారు. రెండేళ్లుగా వేతనం ఇవ్వకుండానే పనిచేయించుకున్న కాంబ్లీ దంపతులు మళ్లీ తమ ఇంటివద్ద కనిపించొద్దని కూడా హెచ్చరించారని పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కాంబ్లి, ఆండ్రియాలపై 342, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News