: ‘టోఫెల్’కూ అంటిన లీకేజీ మకిలీ... కీలక నిందితుడు సహా ఐదుగురి అరెస్ట్


రాష్ట్ర, జాతీయ స్థాయి పరీక్షల వరకే పరిమితమైన లీకేజీ మకిలీ తాజాగా విశ్వవ్యాప్తమైంది. విదేశాలకెళ్లే విద్యార్థుల ఆంగ్ల పరిజ్ఞానాన్ని నిర్ధారించేదుకు నిర్వహించే ‘టోఫెల్’ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని కూడా లీకేజీ వీరులు హ్యాకింగ్ ద్వారా లీక్ చేసేశారు. అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పరీక్షకు 10 గంటలు ముందుగానే ప్రశ్నాపత్రాన్ని డౌన్ లోడ్ చేసేశాడు. దాదాపు 78 సర్వర్లను హ్యాక్ చేసిన ఈ ముఠాపై సమాచారం అందుకున్న హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రశ్నాపత్రాన్ని డౌన్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే అభిషేక్ రెడ్డి సహా అతడి ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద సంఖ్యలో కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News