: ‘హోదా’ కోసం ఆగిన మరో గుండె... అనంతలో వైసీపీ కార్యకర్త మృతి
ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్న కారణంగా ఆ రాష్ట్రంలో మరో గుండె ఆగిపోయింది. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కేతిగానిచెరువు గ్రామానికి చెందిన ఉప్పర సిద్ధప్ప నేటి ఉదయం గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచాడు. వైసీపీ కార్యకర్తగా కొనసాగుతున్న ఉప్పర సిద్ధప్ప ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతోనే గుండెపోటుకు గురయ్యాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. సిద్ధప్ప మృతి సమాచారం అందుకున్న పలువురు వైసీపీ నేతలు సంతాపం ప్రకటించారు.