: సంస్కృతంలో దూరదర్శన్ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లు!
సంస్కృతంలో వార్తలు, ఇతర కార్యక్రమాలను ఆసక్తిగా చూసే వారికి మరింత మెరుగైన కార్యక్రమాలను అందించేందుకు సర్కారీ చానెల్ ‘దూరదర్శన్’ వినూత్న చర్యకు శ్రీకారం చుట్టింది. సంస్కృతంలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రేక్షకుల అభిప్రాయాలతో పాటు వారి సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు ‘దూరదర్శన్ న్యూస్’ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం సంస్కృతంలో ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలను ఓపెన్ చేసింది. సంస్కృత భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని దూరదర్శన్ న్యూస్ నిన్న వీటిని ప్రారంభించింది.