: నవ్యాంధ్ర రాజధానిలో చంద్రబాబు గృహప్రవేశం... పాలు పొంగించిన భువనేశ్వరి


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నవ్యాంధ్ర రాజధానిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన వారంలో ఐదు రోజులు అక్కడే ఉంటున్నారు. తాజాగా నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని మంగళగిరి సమీపంలోని ఓ ప్రైవేట్ భవంతిని అద్దెకు తీసుకున్న ఆయన అందులోనే తన తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడ సమీపంలో ప్రకాశం బ్యారేజీకి ఆవలి వైపు గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ పరిధిలో కృష్ణా నది తీరం వెంట చంద్రబాబు అద్దెకు తీసుకున్న నివాస భవనం ఉంది. ఈ మేరకు నిన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బంధువులతో కలిసి అక్కడికి వెళ్లి పాలు పొంగించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భువనేశ్వరి పూజలు చేయగా, సాయంత్రం చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News