: రేపు సైకిలెక్కనున్న డొక్కా మాణిక్యవరప్రసాద్!
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. గతంలో వైఎస్సార్సీపీలో చేరనున్నానని ప్రకటించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పట్లో ఏ పార్టీలో చేరేది లేదని ప్రకటించారు. కాంగ్రెస్ లోనే ఉండి తరిస్తానని పేర్కొంటూ జగన్ కు క్షమాపణలు కూడా చెప్పారు. ఇంత కాలం తరువాత ఆయన టీడీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ చేస్తున్న కృషిని అర్థం చేసుకున్న డొక్కా తమ పార్టీలో చేరనున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా, రాయపాటి సాంబశివరావుని రాజకీయ గురువుగా పేర్కొనే డొక్కా ఆయన సలహాతోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.