: హైదరాబాదులో కిడ్నాప్ అయిన ఇద్దరు బాలికలు క్షేమం
హైదరాబాదులోని డబీపూరలో కిడ్నాప్ అయిన ఇద్దరు బాలికలను పోలీసులు క్షేమంగా విడిపించారు. మరో అరగంటలో దుబాయ్ వెళ్లాల్సి వున్న ముబాషిరా, సైదా అనే అమ్మాయిలను రోడ్డుపై ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అప్పటి నుంచి గాలించిన పోలీసులు, ఎట్టకేలకు వారి ఆచూకీ కనుగొన్నారు. దీంతో ఇద్దరు యువకులను అరెస్టు చేసిన పోలీసులు, బాలికలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.