: నేటి అర్ధరాత్రి నుంచి ఏపీలో పెట్రోలు బంకులు బంద్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ ల సీజన్ నడుస్తున్నట్టుంది. నేటి అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్లు బంద్ కు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై పెంచిన 4 శాతం వ్యాట్ కు వ్యతిరేకంగా పెట్రోల్ డీలర్లు 24 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు బంకులు మూతపడనున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధనకు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చి, నేడు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బంద్ విజయవంతమైందని వైఎస్సార్సీపీ ప్రకటించగా, బంద్ విఫలమైందని టీడీపీ పేర్కొంది.

  • Loading...

More Telugu News