: బీఎస్ఎఫ్ జవాన్లపై ప్రతీకారం తీర్చుకున్నాం!: మావోల హెచ్చరికలు


ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పని చేస్తున్న ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లపై ప్రతీకారం తీర్చుకున్నామని మావోయిస్టులు తెలిపారు. బీఎస్ఎఫ్ జవాన్లు తొమ్మిదేళ్ల బాలికను హతమార్చినందుకు ప్రతిగా వారిని హత్య చేశామని తమ పనిని సమర్థించుకున్నారు. హట్టగూడ వద్ద ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడున్న ఆదివాసీలను వేధిస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. అలాగే ప్రభుత్వాలు అటవీ భూములను ఆక్రమించుకుని పెట్టుబడిదారులకు కట్టబెడుతూ, అడవుల నుంచి ఆదివాసీలను తరిమేస్తున్నాయని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News