: వ్యాపార సంస్థల బోర్డులు తెలుగులోనే రాయాలి... ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం


విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటర్మీడియెట్ వరకు తెలుగును సెకండ్ లాంగ్వేజ్ గా తప్పనిసరి చేయాలని, వ్యాపార సంస్థలు తమ సైన్ బోర్డులన్నిటినీ ఇకపై తెలుగులోనే రాయాలని నిర్ణయించారు. అంతేగాక ప్రభుత్వ జీవోలన్నీ తెలుగులోనే విడుదల చేయాలని, తెలుగుకు ప్రాచీన హోదా కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇక వివిధ కేసుల్లో విచారణ సంస్థల జప్తులో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. చిత్తూరు ప్రభుత్వాసుపత్రి నిర్వహణ అపోలో ఆసుపత్రికి అప్పగించాలని, జడ్పీ ఛైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ ల వేతనాలు పెంచాలని నిర్ణయించారు. విశాఖలోని సింహాచలం దేవాలయ భూములను క్రమబద్ధీకరిస్తూ, రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులపై విధివిధానాలు ఖరారు చేస్తూ కొత్త పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

  • Loading...

More Telugu News