: సోంపేట థర్మల్ విద్యుత్ ప్లాంట్ భూమి జీవో రద్దు


శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన భూమి జీవోను ఏపీ క్యాబినెట్ ఈ రోజు రద్దు చేసింది. ప్లాంటు కోసం ఏపీఐఐసీ ద్వారా ఎన్ఈసీకి 972 ఎకరాలు కేటాయించారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. భూమిని వెనక్కి తీసుకుని మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రీస్ అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పారు. థర్మల్ ప్లాంటు రద్దుపై గత ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టాయని ఆరోపించారు. థర్మల్ పవర్ ప్లాంటు రద్దు కోరుతూ ఐదేళ్లుగా నిరాహార దీక్షలు చేస్తున్నారని, ఇకనైనా దీక్షలు విరమించాలని కోరుతున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ ఆస్తుల జప్తు, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ వంటి పలు అంశాలను ఏపీ క్యాబినెట్ లో చర్చించారు. రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తదితర అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News