: వైకాపా బంద్ ను జనాలు ఏ మాత్రం పట్టించుకోలేదు: గాలి
తాము చేపట్టిన బంద్ కార్యక్రమం ఫుల్ సక్సెస్ అంటూ వైకాపా నేతలు చెబుతుంటే... బంద్ అట్టర్ ఫ్లాప్ అయిందని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు. వైకాపా చేపట్టిన బంద్ ను జనాలు అస్సలు పట్టించుకోలేదని అన్నారు. రాఖీ పండుగ రోజు బంద్ కు పిలుపునిచ్చి... హిందూ సాంప్రదాయాలను జగన్ గాలికొదిలేశారని మండిపడ్డారు. తిరుమల కొండలు ఏడు కాదు... కేవలం రెండే అని గతంలో రాజశేఖరరెడ్డి కూడా ఇలాగే చేశారని విమర్శించారు. జగన్ జైలుకెళ్లడం, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కోవడం ఖాయమని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాకుండా ఉండటమే జగన్ కు కావాలని మండిపడ్డారు.