: డల్లాస్ లా హైదరాబాదు...చీప్ లిక్కర్ పై చర్చిస్తాం: నాయిని
హైదరాబాదును డల్లాస్ లా తీర్చిదిద్దుతామని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ప్రవేశపెట్టనున్న చీప్ లిక్కర్ పై అన్ని వర్గాలతో చర్చిస్తామని అన్నారు. గుడుంబా నియంత్రణే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపిన నాయిని, చీప్ లిక్కర్ పై ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, మహిళల సూచనలపై కేబినెట్ భేటీలో చర్చిస్తామని అన్నారు. అనంతరం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా, చీప్ లిక్కర్ ను ప్రవేశపెడతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.