: బీఫామ్ లు అమ్ముకున్న దరిద్రపు చరిత్ర డీఎస్ ది: వీహెచ్ ఫైర్


తన వల్లే కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని... అయినా, ఆ పార్టీ తనకు ఏమీ చేయలేదని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు నిప్పులు చెరిగారు. చివరకు బీఫామ్ లు కూడా అమ్ముకున్న దరిద్రపు చరిత్ర డీఎస్ ది అని విమర్శించారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా దోచుకున్నాడని... దోచుకున్నది దాచుకోవడానికి ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్లాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చానని చెప్పిన డీఎస్... ఇదే మాటను రాజశేఖర్ రెడ్డి ఉండగా ఎందుకు చెప్పలేదని నిలదీశారు. డీఎస్ తో కేసీఆర్ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News