: సగం మంది క్యూ కట్టేశారు... పుజారా ఆదుకోకుంటే అంతే సంగతులు!
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ లో భారత్ ఎదురీదుతోంది. నిన్న మ్యాచ్ ని వరుణుడు అడ్డుకోగా, నేడు 119 పరుగుల వద్ద బిన్నీని ఐదవ వికెట్ రూపంలో కోల్పోయింది. పుజారా 83 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇండియా గౌరవప్రదమైన స్కోరుతో నిలవాలంటే, పుజారా భారీ స్కోరు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఓపెనర్ రాహుల్ 2 పరుగులతో, వన్ డౌన్ బ్యాట్స్ మన్ రహానే 8 పరుగుల వ్యక్తిగత స్కౌరువద్ద ఔటైన తరువాత, నేటి ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన జట్టులో కెప్టెన్ కోహ్లీ 18 పరుగులు, శర్మ 26 పరుగులు చేసి ఔట్ కాగా, బిన్నీ ఖాతా తెరవకుండానే పెవీలియన్ దారి పట్టాడు. పుజారాకు తోడుగా మరో ఎండ్ లో నమన్ ఓజా 20 పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 60 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు.