: మాట తప్పితే రూ. 750 జరిమానా విధిస్తున్న స్పైస్ జెట్... రూ. 400 చాలన్న డీజీసీఏ


లగేజీ లేకుండా ప్రయాణించే పక్షంలో విమాన ప్రయాణ చార్జీలను మరింత తగ్గించి టికెట్లను విక్రయిస్తున్న స్పైస్ జెట్, ఆ స్కీములో భాగంగా టికెట్లు పొంది, అవసరాల నిమిత్తం లగేజీ తీసుకు వెళితే విధిస్తున్న భారీ జరిమానాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అడ్డుకుంది. రూ. 1000 కన్నా తక్కువ ధరలకే టికెట్లను విక్రయిస్తున్న స్పైస్ జెట్, లగేజీ తీసుకువచ్చే వారిపై రూ. 750 జరిమానా విధిస్తోంది. టికెట్ బుకింగ్ సమయంలో 'జీరో బ్యాగ్' డిస్కౌంట్ పొంది ప్రయాణ సమయంలో లగేజీ తీసుకెళ్లిన వారి నడ్డివిరిచేలా ఉన్న ఈ జరిమానా తగదని డీజీసీఏ అక్షింతలు వేసింది. సాధారణ టికెట్ తో పోలిస్తే రూ. 200 డిస్కౌంటుపై జీరో బ్యాగ్ టికెట్లు విక్రయిస్తూ, జరిమానాగా అంత మొత్తం విధించడం సరికాదని అభిప్రాయపడుతూ, రూ. 400 పెనాల్టీ సరిపోతుందని స్పైస్ కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, అన్ని దేశవాళీ విమానయాన సంస్థలు ప్రస్తుతం 15 కిలోల వరకూ ఉచిత చెకిన్ బ్యాగేజీ సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అంటే, 15 కిలోల్లోపు బరువైన లగేజీలను తీసుకువెళ్లేవారు జీరో బ్యాగ్ పథకంలో టికెట్ తీసుకుని, అంతకుమించి లగేజీతో వెళ్లి విమానం ఎక్కాలంటే, రూ. 400 కట్టాల్సి వుంటుంది. అదే లగేజీ 23 కేజీలకన్నా పెరిగితే, ఈ మొత్తం నిబంధనల ప్రకారం మారుతుంటుంది.

  • Loading...

More Telugu News