: ఎలుగుబంటి దాడిలో రెండు కళ్లు కోల్పోయిన శ్రీకాకుళం జిల్లా వాసి


శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని పలాస మండలం మామిడిపల్లి వద్ద జానకీరాం అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి రెండు కళ్లు కోల్పోయాడు. వెంటనే అతడిని కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అయితే ఘటన ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News