: షీనా తన కూతురే అని ఇంద్రాణి నాతో చెప్పింది: పీటర్ ముఖర్జియా


తన సొంత కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో పోలీసుల రిమాండ్ లో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా మూడో భర్త పీటర్ ముఖర్జియా మరో కొత్త విషయాన్ని వెల్లడించారు. షీనా తన సొంత కూతురే అని ఇంద్రాణి తనతో ఎప్పుడో చెప్పిందని సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. అంతకు ముందు, తన కుమరుడు రాహుల్ ముఖర్జియా (పీటర్ తొలి భార్య సంతానం)కు షీనాతో సంబంధం ఉందని పీటర్ తెలిపిన సంగతి తెలిసిందే. షీనా తల్లి ఇంద్రాణియే అని రాహుల్ తనతో అన్నాడని... అయితే ఈ విషయాన్ని ఇంద్రాణి కొట్టి పారేసిందని... షీనా తన చెల్లెలు అనే చెప్పిందని ఇంతకు ముందు పీటర్ చెప్పారు.

  • Loading...

More Telugu News