: విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం


విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అవినీతిపరులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల జప్తుకు ప్రత్యేక చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం నేటి మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనుంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఢిల్లీ పర్యటన వివరాలు, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ అంశాలపై చర్చించనున్నారు. సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News