: మళ్లీ రంగంలోకి దిగిన 'సూది'గాడు... ఆటో డ్రైవర్ కు గుచ్చేందుకు యత్నం


సైకో సూదిగాడు మళ్లీ సీన్ లోకి ఎంటరయ్యాడు. ఇప్పటిదాకా కేవలం ఆడవాళ్లనే టార్గెట్ చేసిన ఈ సైకో తాజాగా ఈరోజు రూటు మార్చాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం అనాకోడేరులో ఒక ఆటో డ్రైవర్ కు సూది గుచ్చేందుకు యత్నించాడు. అయితే, సైకో దాడి నుంచి ఆటో డ్రైవర్ తప్పించుకున్నాడు. అనంతరం జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆటో డ్రైవర్ నుంచి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సైకో సూదిగాడు ఇప్పటిదాకా వారం రోజుల వ్యవధిలో 15 మందికి ఇంజెక్షన్ లు చేశాడు. అతనిని పట్టుకోవడానికి ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

  • Loading...

More Telugu News