: 35 ఏళ్ల తరువాత భారత్ సాధించిన ఘనత ఇదే!
భారత మహిళల హాకీ జట్టు అరుదైన ఘనతను సాధించింది. 35 సంవత్సరాల తరువాత, 2016లో రియోలో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో తుది 12 జట్లలో బెర్తును ఖాయం చేసుకుంది. యూరప్ లో జరుగుతున్న హాకీ చాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా, ఇంగ్లండ్ చేతిలో స్పెయిన్ ఓటమి చెందడంతో, ర్యాంకింగ్స్ ఆధారంగా ఇండియాకు స్థానం లభించింది. భారత మహిళల జట్టు చివరిగా 1980 ఒలింపిక్స్ లో ఆడింది. ఆ తరువాత మరెన్నడూ జట్టు ఎంపిక కావడంలో సఫలం కాలేదు. హాకీ అభిమానుల సుదీర్ఘ నిరక్షణకు తెరదించుతూ, వచ్చే సంవత్సరం జరిగే విశ్వ క్రీడా సంరంభంలో భాగం పంచుకోనుంది. ఆల్ ది బెస్ట్ టీమిండియా!